President Elections | NDA Presidential candiate గా ఎస్టీ మహిళ Draupadi Murmu

2022-06-22 29

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం లో 20 మంది పేర్లు చర్చకు వచ్చాయి. చివరకు ద్రౌపది ముర్ము పేరు ఖరారు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా అన్నారు. ద్రౌపది ముర్ము మంత్రిగా, గవర్నర్ గా పనిచేశారని గుర్తుచేశారు.